బ్రహ్మాస్త్రం ఇది.. ఈ నూనెను తక్కువ చేసి చూడకండి.. ఇలా చేస్తే దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్

|

Nov 22, 2024 | 5:16 PM

ఆముదం విత్తనాల నుండి తీసిన నూనె మానవ శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీనిని ఆముదంగా పిలుస్తారు.. ఆముదం నూనెలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఆయుర్వేదంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు.. ఆముదం నూనెను ఎన్నో రకాల చికిత్సలో ఉపయోగిస్తారు.. దీనిని సాధారణంగా జుట్టు మసాజ్ కోసం ఉపయోగిస్తారు.

బ్రహ్మాస్త్రం ఇది.. ఈ నూనెను తక్కువ చేసి చూడకండి.. ఇలా చేస్తే దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్
Castor Oil
Follow us on

ఆముదం విత్తనాల నుంచి తీసిన నూనె (ఆముదం నూనె) మానవ శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీనిని ఆముదంగా పిలుస్తారు.. ఆముదం నూనెలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఆయుర్వేదంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు.. ఆముదం నూనెను ఎన్నో రకాల చికిత్సలో ఉపయోగిస్తారు.. దీనిని సాధారణంగా జుట్టు మసాజ్ కోసం ఉపయోగిస్తారు. ఆముదంలో కాల్షియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఇందులో ఉంటాయి. దీంతోపాటు యాంటీమైక్రోబయల్.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా చెబుతున్నారు. అందుకే.. ఆయుర్వేదంలో ఆముదం అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేర్కొంటారు. ఆముదం నూనె మీకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

ఆముదం నూనె ప్రయోజనాలు..

జుట్టు పెరుగుతుంది: జుట్టు పెరుగుదలకు ఆముదం చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. జుట్టు రాలడం లేదా బట్టతలతో బాధపడేవారు ఈ నూనెను తలపై అప్లై చేయడం మంచిది. ఇది మూలాలకు పోషణను అందిస్తుంది.. జుట్టును బలపరుస్తుంది.. ఇంకా దాని పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది: ఆముదం జుట్టుకు ఎంత మేలు చేస్తుందో చర్మానికి కూడా అంతే మేలు చేస్తుంది. చర్మ వ్యాధులతో పోరాడడంలో ఆముదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని వాడితే మచ్చలు, మొటిమలు, పొడిబారడం వంటివి పోవడమే కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

మలబద్ధకం నుంచి ఉపశమనం: ఆముదం సహాయంతో మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నయం చేయవచ్చు. పొట్టలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు ఈ నూనెను తాగవచ్చు.

పీరియడ్స్ సమయంలో: ఆముదంతో పీరియడ్స్ సమయంలో నొప్పిని కూడా మహిళలు నివారించవచ్చు. నిజానికి, ఆముదం గింజల్లో ఉండే రిసినోలిక్ యాసిడ్ ఋతుస్రావం సమయంలో ఉపశమనాన్ని అందించడానికి పనిచేస్తుంది. అయితే, మీరు నిపుణుల సలహా తర్వాత మాత్రమే ఉపయోగించాలి.

నొప్పుల నుంచి ఉపశమనం: ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఆముదం బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే.. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా కాలిన గాయాలను తగ్గిస్తుంది. బాధాకరమైన సన్బర్న్ ప్రభావాలను తగ్గించడానికి ఆముదం నూనె రిసినోలిక్ యాసిడ్‌ను కలిగి ఉంటుంది.. ఇది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది.. ఇంకా తలనొప్పి నుంచి ఋతు తిమ్మిరి వరకు అనేక రకాల పరిస్థితులకు ఆముదం నూనె చికిత్సగా ఉపయోగిస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి