Heart Attack Symptoms: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

|

Feb 25, 2022 | 10:08 AM

Heart Attack Warning Signs: గుండె నొప్పి లేదా గుండె పోటు ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. వచ్చినప్పుడు అత్యవసర చికిత్స అందిస్తే మాత్రం బతికి బయటపడవచ్చు. గుండె పోటును ముందుగానే గుర్తించి అప్రమత్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Heart Attack Symptoms: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త
Heart Attack
Follow us on

Health Tips: అప్పటివరకు జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపిస్తుంది. ఏ వ్యాధి ఎప్పుడు చుట్టుముడుతుందో అస్సలు ఊహించలేం. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు తీవ్ర లక్షణాలు కనిపించే వరకు మనకు ఏ వ్యాధి వచ్చిందో పసిగట్టలేం. ప్రాణాంతక వ్యాధులతో ఫైట్ చేయాలంటే ఇమ్యూనిటీ పవర్‌(immunity power)తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. అయితే.. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు కొందరు ఉంటారు. ముఖ్యంగా అలాంటివారు పలు రోగాలపై స్పృహతో ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన బాడీలో గుండె చాలా ముఖ్యమైనది. జీవించి ఉండాలంటే.. గుండె సరిగ్గా కొట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకప్పుడు గుండె జబ్బులు (Heart problems) వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ యువత,  మధ్య వయస్కుల్లో కూడా కనిపిస్తున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నవారు.. అరక్షణంలో అచేతనంగా మారిపోతున్నారు. ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ జన్యుపరమైన కారణాలతో గుండెపోటు తప్పదనేది వైద్యులు చెప్తున్న మాట. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వారు గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అయితే గుండెపోటుకు ముందు మీ శరీరం మీకు నిరంతరం సంకేతాలు ఇస్తుందని చెబుతున్నారు. వాటిని విస్మరిస్తే రిస్క్‌లో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అలెర్ట్ అవ్వండి.. 

  1. మీకు అకస్మాత్తుగా తల తిరగడం లేదా మీకు చల్లగా చెమటలు పట్టడం వంటివి ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.
  2. ఎడవ వైపు చేయి ఎక్కువగా లాగడం లేదా నొప్పిగా అనిపించడం
  3. గుండెపోటు సంకేతాల్లో ఛాతీపై ఒత్తిడి కూడా ఒకటి.ఈ సమయంలో మీకు సరిగా ఊపిరాడదు.. నాడీ కూడా కొట్టుకున్నట్లు అనిపించదు. మీ గుండెకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం లభించనప్పుడు ఛాతీ నొప్పి తరచుగా సంభవిస్తుంది. తరచుగా ప్రజలు ఈ ఒత్తిడిని విస్మరిస్తారు. అయితే ఈ ఒత్తిడి స్థిరంగా ఉంటే గుండెపోటు రావచ్చు.
  4. నీరసంగా , తల తిరుగుతున్నట్లుగా అనిపించడం. సొమ్మసిల్లడం
  5.  దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిప్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి
  6. గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
  7. కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి
  8. కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.
  9. కొందరికి రెండు చేతులు, భుజాలు కూడా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటాయి

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్’

అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?