Health: కాళ్ల వాపులు ఉంటే కిడ్నీ సమస్య అనుకోవద్దు.. ఈ ప్రమాదకర వ్యాధి కూడా అవ్వొచ్చు

|

Aug 08, 2024 | 5:16 PM

అసలు ఈ వాపులు ఎందుకు వస్తాయి? కిడ్నీ సమస్యలే కారణమా..? ఈ సమస్య ప్రమాదకరమా? కాదా? ... కొందరిలో అకారణంగా కాళ్లు, పాదాల్లో వాపుకు కొన్ని అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి. ఈ సమస్య తెలుసుకుందాం పదండి....

Health: కాళ్ల వాపులు ఉంటే కిడ్నీ సమస్య అనుకోవద్దు.. ఈ ప్రమాదకర వ్యాధి కూడా అవ్వొచ్చు
Swollen Feet
Follow us on

కొంతమందికి చిన్న చిన్న కారణాలకే కాళ్లు వాస్తూ ఉంటాయి. కదులకుండా కూర్చని ప్రయాణం చేసినా కొందరికీ కాళ్ల వాపులు కనిపిస్తాయి. పెయిన్ ఎక్కువ లేకపోవడం వల్ల.. ఈ సమస్యను ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు. ఇలా కాళ్లు వాపు ఉంటే.. కిడ్నీ సమస్యలు ఉన్నాయని చాలామంది భావిస్తారు.  కేవలం కిడ్నీ సమస్యల వల్లనే ఇలా.. కాళ్ల వాపులు వస్తాయని అనుకోవద్దు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్ అంటున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ. అవేంటో తెలుసుకుందాం పదండి..

    •  ఉదాహరణకు, కాళ్ల రక్తనాళాలు లీక్ అవ్వడం వల్ల కూడా వాపు రావచ్చు. దీన్ని వారికోస్ వైన్స్ అని అంటారు.
    •  గుండె సమస్యలు ఉన్నప్పుడు, లివర్ పనితీరు తగ్గినప్పుడు, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా కాళ్ల వాపులు రావచ్చు.
    •  కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల, అంటే కొన్ని రకాల బీపీ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా కాళ్ల వాపులు రావొచ్చు.
    • న్యూరోపతి సమస్య ఉంటే… పాదాల్లో ఉండే చిన్నచిన్న నాడులు సరిగ్గా వర్క్ చేయవు. సాధారణంగా ఇలాంటి స్థితి షుగర్‌తో బాధ పడేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా నాడి సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పాదాల్లో వాపు వస్తుంది.
    • పాదాల్లోని రక్త నాళాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అలా పని చేసేందుకు వీలుగా రక్తనాళాలలో వాల్స్ ఉంటాయి. ఈ వాల్వ్‌ల పనితీరు సరిగా లేనపుడు కాళ్లు, పాదాల్లో నీరు చేరుతుంది. అందువల్ల పాదాల్లో, కాళ్లలో వాపు వస్తుంది.
    • ప్రెగ్నెన్సీ సమయంలో కూడా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు వల్ల కాళ్ల వాపులు రావొచ్చు.

కాబట్టి, కాళ్ల వాపులు అనగానే కేవలం కిడ్నీ సమస్యల వల్లనే అని అనుకోవడం కరెక్ట్ కాదు. వెంటనే మంచి వైద్యుడ్ని కలిసి సమస్యను నిర్ధారించుకోండి. ఈ సమాచారం నిపుణులు నుంచి సేకరించబడింది..

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..