బాలికను తల్లి చేసి.. విదేశాలకు చెక్కెసిన యువకుడు

ప్రేమిస్తున్నానన్నాడు. తియ్యగా మాయమాటలు చెప్పాడు. ఇంకే ఆ అభం శుభం తెలియని అమ్మాయి ఆ మాయగాడిని నమ్మింది. కాస్త చనువుగా ఉండటం ప్రారంభించింది. ఇదే అదునుగా ఆ యువకుడు ఆ బాలికను లోభరుచుకున్నాడు. మాయమాటలతో మభ్యపుచ్చుతూ.. ఆ బాలికను గర్భం చేసి.. విదేశాలకు చెక్కేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఆ గ్రామంలో అందర్నీ షాక్‌కు గురిచేసింది. పోలీసుల వివరాల మేరకు.. పుల్లంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన […]

బాలికను తల్లి చేసి.. విదేశాలకు చెక్కెసిన యువకుడు
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 5:57 AM

ప్రేమిస్తున్నానన్నాడు. తియ్యగా మాయమాటలు చెప్పాడు. ఇంకే ఆ అభం శుభం తెలియని అమ్మాయి ఆ మాయగాడిని నమ్మింది. కాస్త చనువుగా ఉండటం ప్రారంభించింది. ఇదే అదునుగా ఆ యువకుడు ఆ బాలికను లోభరుచుకున్నాడు. మాయమాటలతో మభ్యపుచ్చుతూ.. ఆ బాలికను గర్భం చేసి.. విదేశాలకు చెక్కేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. ఆ గ్రామంలో అందర్నీ షాక్‌కు గురిచేసింది. పోలీసుల వివరాల మేరకు.. పుల్లంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. అయితే ఆ బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో.. అక్కడే ఉంటే ఇబ్బందులు వస్తాయనుకున్నాడో ఏమో.. వెంటనే విదేశాలకు పారిపోయాడు.

ఈ జరిగిన మోసాన్ని తెలుసుకొన్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలలు నిండిన ఆ బాలికను పుల్లంపేటకు చెందిన వైద్య సిబ్బంది ఆదరించి.. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను తీసుకెళ్లడానికి బాలిక కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో.. ఈ విషయంలో పోలీసులు కల్పించుకున్నారు. పోలీసులు ఆ బాలిక కుటుంబీకులకు పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారు ఎంతకూ వినకపోయేసరికి అధికారుల సమక్షంలో ఆ పసికందును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. బిడ్డ పర్యవేక్షణను వారు చూసుకొనే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విదేశాలకు పారిపోయిన ఆ యువకుడిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో