టీ కావాలా.. అయితే.. జింజర్ టీ బెటర్

Health benifits, టీ కావాలా.. అయితే.. జింజర్ టీ బెటర్

మనం ఏ పనిచేయాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందడానికి అల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లాన్ని నిత్యం కూరల్లో కూడా వేస్తుంటారు. దీంతో చక్కని రుచి కూడా వస్తుంది.
1) అల్లం టీని తాగి ప్ర‌యాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొంద‌రికి కార్లు, బ‌స్సుల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్ర‌యాణానికి ముందు అల్లం టీ తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
2) కీళ్ల నొప్పులు ఉన్న‌వారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీనివల్ల రక్త సరఫరా మెరుగు పడి హైబీపీ రాకుండా ఉంటుంది.
3) రుతుక్ర‌మం స‌రిగ్గా ఉండ‌ని మ‌హిళ‌లు అల్లం టీ తాగితే ఉత్త‌మం.
4) బాగా త‌ల‌నొప్పి ఉన్నప్పుడు అల్లం టీ తాగితే చిటికెలో నొప్పి తగ్గిపోతుంది.
5) అల్లం టీని నిత్యం తాగడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే గుండె జబ్బులు కూడా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *