FWICE bans RGV: ఆర్టిస్టులకు, టెక్నిషియన్లు కోటికి పైగా ఎగనామం..! ఆర్జీవీపై బ్యాన్ విధించిన సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్..

వర్మ అంటేనే వివాదాలు..విమర్శలు..పబ్లిసిటీ స్టంట్లు. అలా మీడియాలో హాట్ టాపిక్‌ అయి ఉండటం ఆయనకు ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆర్జీవీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు.

FWICE bans RGV: ఆర్టిస్టులకు, టెక్నిషియన్లు కోటికి పైగా ఎగనామం..! ఆర్జీవీపై బ్యాన్ విధించిన సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 5:48 PM

FWICE bans RGV: వర్మ అంటేనే వివాదాలు..విమర్శలు..పబ్లిసిటీ స్టంట్లు. అలా మీడియాలో హాట్ టాపిక్‌ అయి ఉండటం ఆయనకు ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆర్జీవీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పని చేసిన ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు భారీగా డబ్బులు బాకీ పడినట్లు సమాచారం. ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) సీరియస్‌గా స్పందించింది. వర్మపై ఏకంగా బ్యాన్ విధించింది.  తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పనిచేయరని తేల్చి చెప్పింది.

కరోనా వ్యాప్తి సమయంలో కూడా బ్రేక్ ఇవ్వకుండా వరస సినిమాలు చేశారు వర్మ. ఈ క్రమంలో పనిచేసిన టెక్నిషియన్లకు, ఆర్టిస్టులకు  జీతాలు చెల్లించలేదని.. మొత్తం కలిపి రూ. కోటికి పైనే పెండింగ్ పెట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తెలిపింది. ఈ ఇష్యూపై సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ, ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే స్పందిస్తూ.. జీతాలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపినప్పటికీ వర్మ స్పందించపోవడం దారుణమన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు రెస్పాండ్ అవ్వలేదని.. అందుకే భవిష్యత్తులో వర్మతో పని చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చామన్నారు ఫెడరేషన్ సభ్యులు.

Also Read :

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం