Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితం

ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర స‌రుకుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బంది ఏర్పాట్లు చేశాయి. ఈ క్ర‌మంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ..
free milk and vegetables upto april 14 in karnataka, ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితం
దేశంలో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో అన్ని దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార స‌ముదాయాలు మూత‌ప‌డ్డాయి. ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర స‌రుకుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బంది ఏర్పాట్లు చేశాయి. ఈ క్ర‌మంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
బంద్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిరంతరాయంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు, కూర‌గాయ‌లు,పాలు, సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా ప్ర‌క‌టించారు కర్నాటక సీఎం యడియూరప్. ట్రాన్స్ పోర్టు లేక రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సాధ్యం కావట్లేదని, హాప్ కామ్స్ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు ఈ నెల 14 వరకు ఉచితంగా పాలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల కలెకర్ట్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో పాటుగా కోడిగుడ్లను కూడా హాప్ కామ్స్ ద్వారా అమ్ముతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, ప‌ప్పు మిల్లులను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం ప్ర‌క‌టించారు.

Related Tags