
భారతదేశంలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతను వివరించేందుకు eRZL బృందం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక ప్రత్యేకమైన ఆన్-గ్రౌండ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. eRZL టీమ్ నగరంలోని పలు వీధులు, వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులతో నేరుగా మాట్లాడింది. ప్రజలకు హైడ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా, రోజంతా కష్టపడేవారు, ప్రయాణించేవారు, అవుట్‌డోర్ కార్యకలాపాలలో పాల్గొనేవారు ,వేడికి గురయ్యే వారు తమ శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. eRZL డ్రింక్స్ ద్వారా శరీరానికి తక్షణ శక్తిని, హైడ్రేషన్‌ను ఎలా అందించవచ్చో స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.