Facebook Improvements : ఫోటో పంపిస్తే చెప్పెస్తుంది.. ఫేస్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్ వారి కోసమే…

అంధులు, దృష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం ఫేస్‌బుక్‌ తన ఏఐ ఆధారిత సేవల్లో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గతంలో అంధులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తుంటే ఫొటో వస్తే కేవలం ఫొటో అనే వర్డ్‌ వినిపించేంది. ఇది ఆర్టిఫిషియల్..

Facebook Improvements : ఫోటో పంపిస్తే చెప్పెస్తుంది.. ఫేస్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్ వారి కోసమే...
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 23, 2021 | 5:53 AM

Facebook Improvements : ఫేస్‌బుక్‌… ఇదెంత ఫేమసో అందరికీ తెలుసు. చాలామంది నిత్యం అందులోనే గడిపేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమం.. సామాజిక బాధ్యతతో ముందుకు అడుగులు వేస్తోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

తాజాగా అంధులు, దృష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం ఫేస్‌బుక్‌ తన ఏఐ ఆధారిత సేవల్లో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గతంలో అంధులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తుంటే ఫొటో వస్తే కేవలం ఫొటో అనే వర్డ్‌ వినిపించేంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఏఏటీ అంటే ఆటోమేటిక్‌ ఆల్టర్‌నేటివ్ టెక్ట్స్‌ సహాయంతో పనిచేస్తుంది. తాజాగా ఏఏటీని ఫేస్‌బుక్‌ అప్‌డేట్ చేసింది.

ఈ కొత్త అప్‌డేట్‌తో ఫేస్‌బుక్‌లో ఫొటో కనిపిస్తే ఆ ఫొటోను వివరిస్తూ ఏఐ వాయిస్‌ వినిపించనుంది. అందులో ఏమేం ఉంది… ఆ ఫోటో దేనికి సంబంధించినది.. అది గ్రూప్ ఫోటో అయితే ఆ ఫొటోలో ఎంత మంది ఉన్నారు. ఏ పొజిషన్‌లో ఎవరున్నారు.. ఇలా ప్రతి అంశాన్ని వివరిస్తూ అన్ని వివరాలను చెప్పేస్తుంది.

అంతే కాదండోయ్.. ఆ ఫొటో ఎక్కడ తీసుకున్నారు..ఆ ఫోటో తీసుకున్న సమయంతోపాటు లోకేషన్.. ఆ ఫోటోలో ఉన్న పరిసరాలను కూడా తెలియజేస్తుంది. దీంతో అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఫొటోను సులభంగా అర్థం చేసుకుంటారని ఫేస్‌బుక్‌ అంటోంది.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..