చంద్రయాన్-2: ఎవరూ వెళ్లని చోటే ల్యాండింగ్ చేస్తాం: ఇస్రో చీఫ్

Everything going according to plan Isro chief on proposed soft landing of 'Vikram' module, చంద్రయాన్-2: ఎవరూ వెళ్లని చోటే ల్యాండింగ్ చేస్తాం: ఇస్రో చీఫ్
‘చంద్రయాన్-2’లోని విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లిపై ఇంతకు ముందు ఎవరూ వెళ్లని ప్రదేశంలో ల్యాండ్ చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ కె.శివన్ శుక్రవారంనాడు తెలిపారు. విక్రమ్ మృదువగా ల్యాండింగ్ అవుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండర్ పాదం మోపే క్షణం కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ‘చంద్రయాన్-2’లోని విక్రమ్ మాడ్యూల్ విజయవంతంగా, సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు.  ‘మేము చేయాల్సినందంతా చాలా కట్టుదిట్టంగా చేశాం. రాత్రి రాబోయే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రయాన్-2 తుది ఘట్టం చూసేందుకు ప్రధాని మోదీ కూడా స్వయంగా వస్తుండటంతో ఇది చాలా పెద్ద ఈవెంట్‌ కానుంది’ అని మీడియాతో మాట్లాడుతూ శివన్ అన్నారు. కాగా, చంద్రయాన్ ప్రత్యేక క్షణాలను వీక్షించి ఆఫోటోలను తనతో షేర్ చేసుకోవాలని, వారిలో కొన్నింటికి రీట్వీట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో దేశ ప్రజలను కోరారు.
చంద్రుని దక్షిణ ధ్రువంలోని రెండు లోయల మధ్యలో ఉన్న సమతలమైన స్థలంలో విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఆల్రెడీ ముందుగా అనుకున్న స్థలం సరిగా లేదని భావిస్తే… ఆ చుట్టుపక్కల మరో స్థలాన్ని ఎంచుకుంటారు శాస్త్రవేత్తలు. స్థలం ఎలా ఉందో చూసేందుకు చంద్రయాన్-2 ఆర్బిటర్‌కి అమర్చిన ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ఉపయోగపడనుంది. ఇలా స్థలాన్ని వెతకడానికి అరగంట సమయం కేటాయిస్తున్నారు. అందువల్ల 1-40 సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందన్నమాట. అలా దిగే సమయంలో దాని వేగం సెకండ్‌కి 3 అడుగులు ఉంటుంది. ఇలా దిగడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగంలో ఈ 15 నిమిషాలూ… అత్యంత కీలకమైనవి. ఇది ల్యాండింగ్ సక్సెస్ చెయ్యడం అత్యంత కష్టమైన పని. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ప్రయోగమే వేస్టవుతుంది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలా ల్యాండింగ్ చెయ్యగలిగాయి. అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు ఇప్పుడు నిద్ర పట్టని పరిస్థితి. ఊపిరి బిగపట్టి అంతా ఈ ప్రయోగ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు.
Everything going according to plan Isro chief on proposed soft landing of 'Vikram' module, చంద్రయాన్-2: ఎవరూ వెళ్లని చోటే ల్యాండింగ్ చేస్తాం: ఇస్రో చీఫ్

06/09/2019,5:32PM
Everything going according to plan Isro chief on proposed soft landing of 'Vikram' module, చంద్రయాన్-2: ఎవరూ వెళ్లని చోటే ల్యాండింగ్ చేస్తాం: ఇస్రో చీఫ్

06/09/2019,5:45PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *