Yeshanagula Song: యూట్యూబ్‌లో ఏశనాగుల సాంగ్ హవా.. నంబర్ 1 ట్రెండింగ్‌గా ది పారడైజ్ పాట..
దసరా వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమాలో నాని 'జాడల్' అనే రస్టిక్ , వైలెంట్ పాత్రలో కనిపించనున్నారు. జడలు వేసిన జుట్టు, ముక్కు పుడకలు, పెద్ద బొట్టుతో మునుపెన్నడూ చూడని డిఫరెంట్ మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు.

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ భారీ యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన ‘ఏశనాగుల’ (Yeshanagula) పాటకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఈ జానపద/మాస్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన తెలంగాణ జానపద శైలి సాహిత్యం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డిలు పాడిన తీరు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన వెంటనే నెటిజన్లను, మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుని శరవేగంగా మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ సంపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఒడేలా కాంబినేషన్‌లో వస్తున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటలో నాని మాస్ అండ్ రస్టిక్ అవతార్ అభిమానులను ఎంతగానో థ్రిల్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని మాస్ బీట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..
మొత్తానికి ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ 1 గా నిలిచి, ‘ది పారడైజ్’ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రం ద్వారా నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ఏశనాగుల సాంగ్..
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..
