Shahrukh Gauri Khan Love Story: ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ లవబుల్ కపుల్..

బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , గౌరీఖాన్ లు. వీరిరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆయితే ఈ జంట ముచ్చటగా...

Shahrukh Gauri Khan Love Story: ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్న  బాలీవుడ్ లవబుల్ కపుల్..

Updated on: Jan 16, 2021 | 2:09 PM

Shahrukh Gauri Khan Love Story: బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , గౌరీఖాన్ లు. వీరిరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆయితే ఈ జంట ముచ్చటగా మూడు సార్లు పెళ్లి చేసుకున్నారనే విషయం మాత్రం కొందరికే తెలుసు.. అవును షారుఖ్ ఖాన్ ఢిల్లీలో కాలేజీలో చదువుతున్న సమయంలో గౌరీతో పరిచయం ఏర్పడిందట. అనంతరం పరిచయం ప్రేమగా మారిందని.. తానే ముందుగా గౌరీని ఇష్టపడ్డానని షారుఖ్ పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత ఈ జంట మధ్య పెళ్లికి ముందు ఆరేళ్ళు ప్రేమాయణం సాగిందట.

నటన పై ఇష్టంతో షారుఖ్ ఖాన్ ఓ వైపు సినిమాల్లో ట్రై చేస్తూనే మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. డిడి లో ప్రసారమైన సర్కస్ సీరియల్ తో ఓ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. అనంతరం బాలీవుడ్ లో అడుగు పెట్టాడు దీవానా, బాజీగర్, డర్, కుచ్ కుచ్ హోతాహై వంటి అనేక హిట్ సినిమాల్లో నటించాడు షారుఖ్ ఖాన్. అయితే ఈ సమయంలో షారుఖ్ కు గౌరీ ఆర్ధికంగా సహాయం చేస్తూ అని విధాలా అండగా నిలబడింది అని షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి గర్వంగా చెప్పాడు.

అంతేకాదు బాలీవుడ్ లో ఈరోజు హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే గౌరీ తనకు ఇచ్చిన ప్రోత్సాహమే అని అంటాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ లో ఈ అందమైన జంట ప్రేమ కథ సినిమాని తలపిస్తుంది. షారుఖ్ ఖాన్ ముస్లిం, గౌరీ పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన మహిళ. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలకు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ మొదట పెద్దలకు తెలియకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇరువు తమ పెద్దలను ఒప్పించి రెండో సారి ముస్లిం సంప్రదాయంలో మూడో సారి పంజాబీ శైలిలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహ బంధానికి ఈ ఏడాది అక్టోబర్ లో 30 ఏళ్ళు నిండనున్నాయి.

Also Read: మనం జంతువులను తింటున్నాం.. నా మృతదేహన్ని సింహాలకు వేయండని కోరుతున్న నటుడు…

Follow Us