Ricky Death Wish Viral:మనం జంతువులను తింటున్నాం.. నా మృతదేహన్ని సింహాలకు వేయండని కోరుతున్న నటుడు…

ఎవరైనా మరణం తర్వాత తన దహన సంస్కారాలను బాగా చేయమని కోరుకుంటారు. మరికొందరు మరణం తర్వాత శవాన్ని కాల్చినా పూడ్చినా ఏమొస్తుందని ఆలోచించి... సమాజానికి ఉపయోగపడే పని చేయాలని భావిస్తారు...

Ricky Death Wish Viral:మనం జంతువులను తింటున్నాం.. నా మృతదేహన్ని సింహాలకు వేయండని కోరుతున్న నటుడు...
Follow us

|

Updated on: Jan 16, 2021 | 1:19 PM

Ricky  Death Wish Viral: ఎవరైనా మరణం తర్వాత తన దహన సంస్కారాలను బాగా చేయమని కోరుకుంటారు. మరికొందరు మరణం తర్వాత శవాన్ని కాల్చినా పూడ్చినా ఏమొస్తుందని ఆలోచించి… సమాజానికి ఉపయోగపడే పని చేయాలనీ భావిస్తారు. తమ మరణాంతరం డెడ్ బాడీని ఏ మెడికల్ కాలేజీకో అప్పగించాలని.. లేదా అవయవాలను దానం చేయాలని కోరుకుంటారు. అయితే బ్రిటన్ కు చెందిన ఓ నటుడు నలుగురికి నచ్చింది నాకు అసలు నచ్చదు.. నా రూటే సెపరేటు అనుకున్నాడేమో.. తాను మరణించిన తర్వాత తన మృతదేహాన్ని జూలో ఉండే సింహాలకు ఆహారంగా వేయాలని.. వాటి ఆకలి తీర్చాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిపై లండన్ జూ అధికారులు స్పందించారు.

బ్రిటన్‌కు చెందిన హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీస్ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రికీ ని మీరు మరణించిన తర్వాత మీ మృత దేహాన్ని ఏమి చేయాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించారు. వెంటనే రికీ స్పందిస్తూ.. తన మృత దేహాన్ని లండన్ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా వేయాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. తన శరీరం కనీసం మరో ప్రాణి ఆకలితీరుస్తుందని.. అలాగైనా ఉపయోగపడుతుందన్నాడు. తాను ఇలా కోరుకోవడానికి ఓ కారణం ఉందంటూ ఓ రేంజ్ లో వివరణ కూడా ఇచ్చాడు.

మనిషి తన అవసరాల కోసం స్వేచ్ఛగా తిరిగే జంతువులను చంపి తింటున్నాడు.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులను నరికేస్తున్నాడు .. అన్నీ ఇస్తున్న ప్రకృతికి మనం తిరిగి ఏమీ ఇవ్వడం లేదు కనుక తన దేహాన్ని మరణం తర్వాత సింహాలకు ఆహారంగా ఇవ్వాలని కోరుతున్నానని చెప్పాడు రికీ. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లో భావాలను ఎలా ఉంటాయో చూడాలని ఉందని తెలిపాడు.

ఇదే విషయంపై లండన్ జూ అధికారులు స్పందించారు. మీ కోరికను మేము తీర్చలేము.. మా జూలోని సింహాలకు మీ శరీరాన్ని తినడానికి కష్టంగా ఉండొచ్చు.. అదే సింహాలకు ఆహారం కొనడానికి విరాళం ఇవ్వండి చాలు అని జూ నిర్వాహణాధికారి కోరారు. అంతేకాదు కరోనా తర్వాత జూ నిర్వహణ చాలా భారంగా మారిందని ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే విరాళంగా ఇవ్వండి.. వాటితో జూలో జంతువుల ఆకలిని తీరుస్తామని చెప్పారు.

Also Read: ఈరోజు ప్రపంచ దేశాలు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం చైనా.. ఆధారాలున్నాయన్న పాంపియో