Sushant Case: ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్పారు: ఎన్సీబీ

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌, శ్రద్ధా కపూర్‌లను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే.

Sushant Case: ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్పారు: ఎన్సీబీ

Edited By:

Updated on: Sep 28, 2020 | 2:49 PM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌, శ్రద్ధా కపూర్‌లను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కోణంలో వాట్సాప్ చాట్ ఆధారంగా వీరిని విచారించారు. అయితే తాము స్మోక్ కూడా చేయమని ఈ నలుగురు హీరోయిన్లు చెప్పినట్లు ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు సుశాంత్ డ్రగ్స్ అలవాటు గురించి కూడా తమకు ఎలాంటి అవగాహన లేదని వారు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఆ నలుగురిని ఫోన్‌లను ఇప్పటికే సీజ్ చేయగా.. వాటిని టెక్నికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, అందులో అన్ని అనుమానాలు తీరుతాయని ఆయన వెల్లడించారు.

ఇక ఈ కేసులో కరణ్‌ జోహార్ పేరును చెప్పాలంటూ తన క్లైంట్‌ క్షితిజ్ రవి ప్రసాద్‌పై ఒత్తిడి తీసుకొచ్చారంటూ ఆయన తరఫు న్యాయవాది సతీష్‌ మనీషిండే చేసిన ఆరోపణలను ఎన్సీబీ ఖండించింది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 20 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో రియా, ఆమె సోదరుడు షోయబ్‌, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, సుశాంత్ వంటమనిషి దినేష్ సావంత్, కరణ్‌ జోహార్ ప్రధాన అనుచరుడు క్షితిజ్ రవి ప్రసాద్ సహా పలువురు ఉన్నారు.

Read More:

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేష్‌

త్వరలో హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ఛానెల్‌: వైవీ సుబ్బారెడ్డి