Laapataa Ladies: ‘మిస్సింగ్ లేడీస్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. దశాబ్ధం తర్వాత కిరణ్ రావ్ డైరెక్షన్ లో..దుమ్ములేపుతున్న టీజర్..

|

Aug 11, 2022 | 6:56 AM

ప్రముఖ మూడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ డైరెక్షన్ లో దశాబ్ధం తర్వాత మరో మూవీ ప్రేక్షకులను అలరించబోతుంది. అమీర్ ఖాన్ ప్రోడక్షన్ లో కిండ్ లింగ్ సమర్పణలో

Laapataa Ladies: మిస్సింగ్ లేడీస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. దశాబ్ధం తర్వాత కిరణ్ రావ్ డైరెక్షన్ లో..దుమ్ములేపుతున్న టీజర్..
Missing Ladies
Follow us on
Laapataa Ladies: ప్రముఖ మూడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ డైరెక్షన్ లో దశాబ్ధం తర్వాత మరో మూవీ ప్రేక్షకులను అలరించబోతుంది. అమీర్ ఖాన్ ప్రోడక్షన్ లో కిండ్ లింగ్ సమర్పణలో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈమూవీ వచ్చే ఏడాది మార్చి 3వ తేదీన థియేటర్ లలో విడుదలవుతుందని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో వెల్లడించింది. ఈమూవీకి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసింది.
2011లో ‘ధోబీ ఘాట్’ మూవీకి దర్శకత్వం వహించిన 11 సంవత్సరాల తర్వాత కిరణ్ రావ్ మరో మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి కామెడీ డ్రామాతో ఈచిత్రం తెరకెక్కబోతోంది. 2001లో గ్రామీణ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా తీస్తున్న ‘లాపటా లేడీస్’ లో స్పర్ష్ శ్రీవాస్తవ, రవి కిషన్, ఛాయా కదమ్ తో పాటు వధువుల పాత్రలో ఇద్దరు యువ నటీమణులు నటించబోతున్నారు. ఇద్దరు యువ వుధువులు రైలులో తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుందనే దాని ఆధారంగా ఈమూవీ సాగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..