
తమిళ హీరో విశాల్ నటి అనిషా అల్లా ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి వివాహం ఆగష్టు లో జరగనుందని వినికిడి. ఇది ఇలా ఉంటే వీరి నిశ్చితార్ధనికి డేట్ ఫిక్స్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్థం ఈనెల 16న హైదరాబాద్ లో జరగనుందట. ఇక ఈ వేడుక లో కేవలం కుటుంబ సభ్యులు , బంధు మిత్రులు పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఆగష్టు లో జరగబోయే పెళ్లి మాత్రం గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారట విశాల్ కుటుంబ సభ్యులు. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు ఈ వివాహానికి హాజరు కానున్నారట.