Jathi Ratnalu pre release event Live: యంగ్‌హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటైర్‌టైనర్ జాతి రత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో తన కామెడితో హాస్యాన్ని పండించిన నవీన్ ఈసారి కామెడి డోస్ మరింత పెంచి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ముఖ్యంగా చిట్టి అనే సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నాడు హీరో నవీన్. దానిలో భాగంగా ఆదివారం సాయంత్రం జాతి రత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు.