త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ..?

| Edited By:

Mar 05, 2019 | 12:29 PM

వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించనున్నాడట. తెలుగు, తమిళం, కన్నడలో తెరకెక్కనున్న ఈ మూవీకి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. క్రీడా నేపథ్యంలో ఈ మూవీ సాగనుండగా.. అందులో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ […]

త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ..?
Follow us on

వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించనున్నాడట. తెలుగు, తమిళం, కన్నడలో తెరకెక్కనున్న ఈ మూవీకి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్.

క్రీడా నేపథ్యంలో ఈ మూవీ సాగనుండగా.. అందులో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి. కాగా ఇటీవలే డియర్ కామ్రేడ్‌ను పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు.