సరోగసి అంశంతో నయనతార, విఘ్నేశ్ దంపతులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవలలకు జన్మనివ్వడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నయన్ దంపతులు చట్టాలను ఉల్లంఘించి సరోగసి విధానాన్ని అనుసరించారని వాదనలు వినిపించాయి. తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరగా, ఈ జంట ఇచ్చిన వివరణతో వివాదం సమసిపోయింది. ఇదిలా ఉంటే విఘ్నేశ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
విఘ్నేశ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలో స్టోరీస్‌లో.. ‘మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మంచి కనిపిస్తుంది’ అంటూ గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన కొటేషన్‌ను విఘ్నేశ్ పోస్ట్ చేశారు. ఇక మరో స్టోరీలో.. ‘మనకు మంచి రోజులు ఉన్నాయి. కానీ ఫ్రస్టేషన్ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.’ అని రాసుకొచ్చారు.
దీంతో విఘ్నేశ్ ఈ పోస్టులు ఎందుకు చేశారబ్బా అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. సరోగసి నేపథ్యంలో చెలరేగిన వివాదం విఘ్నేశ్‌ను బాగా డిస్ట్రబ్ చేసినట్లు ఈ పోస్టులు చూస్తే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే నయనతార మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. మరి రానున్న రోజుల్లో నయన్ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..