Kota Srinivasa Rao: ఇప్పుడున్న కమెడియన్లలో ఆ ఇద్దరంటే చాలా ఇష్టం.. అతడి కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..

దివంగత నటుడు కోట శ్రీనివాస రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ఎంతో మంది నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన.. తనకు ఇష్టమైన కమెడియన్స్, హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kota Srinivasa Rao: ఇప్పుడున్న కమెడియన్లలో ఆ ఇద్దరంటే చాలా ఇష్టం.. అతడి కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..
Kota Srinivasa Rao

Updated on: Nov 17, 2026 | 6:41 PM

తెలుగు సినీ ప్రపంచంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం, విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దివంగత నటుడు కోట శ్రీనివాస రావు. విలన్ గా, నటుడిగా, కమెడియన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సో,ల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, విజయాలు చూశారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకోవడంతో పాటు, తన అభిమాన హాస్యనటులు, నేటితరం అగ్ర కథానాయకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “తెలుగు ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు?” అని అడిగిన ప్రశ్నకు కోట శ్రీనివాసరావు ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ తనకు ఆలీ, బాబూ మోహన్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. బాబూమోహన్‌తో తన అనుబంధాన్ని, అతని అద్భుతమైన టైమింగ్‌ను గుర్తుచేసుకున్నారు. బాబూమోహన్ కామెడీ టైమింగ్ , ప్రతి సినిమాలోనూ అతన్ని తన్నినట్టు ఉండేదని, అయితే తాను కేవలం అట్టా టచ్ చేస్తే చాలు వాడు పడిపోయేవాడని సరదాగా వివరించారు. ఆ టచ్ చేయడానికి కరెక్టుగా వచ్చి నుంచునేవాడని, ఇది బాబూమోహన్ హాస్య నటనకు నిదర్శనమని కోట అన్నారు. అలీ పట్ల కూడా తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, అలీ కూడా కోట శ్రీనివాసరావుపై తన అభిమానాన్ని అనేకసార్లు వెల్లడించారని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

విజయం సాధించడానికి కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని, అదృష్టం కూడా తోడుండాలని కోట శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. “మనకి పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి,” అని ఆయన యువతరానికి సందేశమిచ్చారు. తన విషయంలో ఈ రెండూ కలిశాయని, అందుకే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని వినయంగా తెలిపారు. మహానుభావులు తనకంటే ఎంతోమంది ఉన్నారని, అయితే అదృష్టం కలిసి వచ్చి తాము పైకి వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎవరంటే ఇష్టమని అడగగా, కోట శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబుల పేర్లను ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ వాక్ శుద్ధి గురించి మాట్లాడుతూ, అతని సంభాషణ శైలి గమ్మత్తుగా ఉంటుందని, అది అతని ప్రత్యేకత అని అన్నారు. అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుతూ, “బన్నీ యాక్షన్ చూస్తే, ఫైట్లు గానీ, డాన్సులు గానీ చూస్తే అసలు ఎట్టా చేస్తున్నాడురా అనిపిస్తుంది,” అని ప్రశంసించారు. అతని ప్రతిభకు, కృషికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ఆయనను “లవబుల్ బాయ్”గా తెలిపారు. “ఇప్పుడు ఎంత మంది హీరోలు వచ్చినా అతనిలాగే ఎవరూ ఉండలేరు,” అని మహేష్ బాబు ప్రత్యేకతను కొనియాడారు. ఈ ముగ్గురు హీరోలపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us