Ram Gopal Varma : లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌ను రిలీజ్ చేయనున్న వర్మ.. ఈ సారి ఏకంగా మాఫియా డాన్ స్టోరీతో..

వివాదాలతో రామ్ గోపాల్ వర్మ అయినంత ఫెమస్ మారే సెలబ్రిటీ అవ్వలేదు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకు కాంట్రవర్సీని పెంచుకుంటూ పోతున్నారు..

Ram Gopal Varma : లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌ను రిలీజ్ చేయనున్న వర్మ.. ఈ సారి ఏకంగా మాఫియా డాన్ స్టోరీతో..

Updated on: Jan 13, 2021 | 7:48 PM

Ram Gopal Varma : వివాదాలతో రామ్ గోపాల్ వర్మ అయినంత ఫెమస్ మరే సెలబ్రిటీ అవ్వలేదు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా…సినిమాకు కాంట్రవర్సీ డోస్ పెంచుకుంటూ పోతున్నారు వర్మ. లాక్ డౌన్ లో వరుస సినిమాలను ప్రేక్షకుల మీదకు వదిలిన వర్మ త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఆషామాషీ సినిమా కాదు వర్మ  లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ . ఇంతకు ఆసినిమా ఏంటని ఆలోచిస్తున్నారా అదే దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర.

తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ట్వీట్ చేశారు వర్మ.. లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నామని ఆర్జీవి ప్రకటించారు. దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోనే భయంకరమైన ఆర్గనైజేషన్ గా ఎలా ఎదిగాడో చెప్పే నిజమైన కథ అని వర్మ పేర్కొన్నాడు.ఇక దావూద్  ఇబ్రహీం స్టోరీతో సినిమా చేస్తానని ఎప్పటినుంచో ఆర్జీవీ చెప్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నట్టు తెలిపారు వర్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan kalyan new look : పంచకట్టులో పవర్ స్టార్ పవన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు