కొత్త సంవత్సరంలో టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ కవి వెన్నెల కంటి కన్నుముశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో మంగళవారం మృతిచెందారు. వెన్నెల కంటి పూర్తి పేరు వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్. పలు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా వెన్నెలకంటి పనిచేశారు. దాదాపు 2000 సినిమాలకు ఆయన పాటలు రాశాడు. ఆయకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి కూడా సినీ రచయితగా చేస్తుండగా.. రెండవ కుమారుడు రాకెందు మౌళి. వెన్నెల కంటి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదచయాలు నెలకొన్నాయి. వెన్నెల కంటి మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.