Valmiki Trailer: గత్తెర లేపినవ్.. చింపేసినవ్ పో..!

| Edited By:

Sep 09, 2019 | 5:24 PM

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. తెలుగులో వరుణ్ తేజ్, అథర్వ మురళీ నటించారు. ఇక ఈ మూవీ కోసం మొదటి సారిగా విలన్‌గా మారాడు వరుణ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ విషయానికొస్తే.. ఫామ్‌లో ఉన్న […]

Valmiki Trailer: గత్తెర లేపినవ్.. చింపేసినవ్ పో..!
Follow us on

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. తెలుగులో వరుణ్ తేజ్, అథర్వ మురళీ నటించారు. ఇక ఈ మూవీ కోసం మొదటి సారిగా విలన్‌గా మారాడు వరుణ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ విషయానికొస్తే.. ఫామ్‌లో ఉన్న డాన్‌పై ఓ సినిమా తీయాలనుకుంటాడు అథర్వ మురళి. మరోవైపు గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్.. తన రౌడీయిజంతో అందరినీ బయపెడుతుంటాడు. ఈ క్రమంలో వరుణ్‌కు తెలియకుండా అతడిపై బెట్ వేసి అతడి సినిమాను తీయాలనుకుంటాడు అథర్వ. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి..? రౌడీగా ఉండే వరుణ్‌ను అధర్వ తన సినిమాలో ఎలా చూపించాడు..? గద్దలకొండ గణేష్ లవ్ స్టోరీ ఏంటి..? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ట్రైలర్‌లో రౌడీ పాత్రలో తెలంగాణ యాసతో అదరగొట్టేశాడు వరుణ్. అలాగే వరుణ్ కోసం తన పెన్ పవర్‌ను మరోసారి బయటకు తీశాడు హరీశ్ శంకర్. ‘‘నాపై పందేలు వేస్తే గెలుస్తారేమో..నాతోటి పందేలేస్తే సస్తారు’’.. ‘‘మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే.. ఇక బతుకుడెందుకు రా’’.. ‘‘గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీ లహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్, అదే ప్యాషన్’’ అనే డైలాగ్‌లు అదిరిపోయాయి. అలాగే అథర్వ, పూజా హెగ్డే తదితరుల పాత్రలను ట్రైలర్‌లో రివీల్ చేసేశారు. వీటితో పాటు ట్రైలర్‌కు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం మెయిన్ అస్సెట్‌గా నిలిచింది.  మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు వాల్మీకి.

ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే రెండోసారి జత కడుతుండగా.. అథర్వ సరసన మృణాళిని రవి నటించింది. ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, సత్య, సుబ్బరాజు, బ్రహ్మాజీ, శత్రు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అలాగే సుకుమార్, నితిన్ అతిథి పాత్రల్లో నటించారు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.