New Year 2021: న్యూఇయర్ గిఫ్ట్‏గా ‘వరుడు కావలెను’ పోస్టర్ రివీల్.. రీతువర్మ, నాగశౌర్య లుక్ అదుర్స్..

|

Jan 01, 2021 | 1:26 PM

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాతో

New Year 2021: న్యూఇయర్ గిఫ్ట్‏గా వరుడు కావలెను పోస్టర్ రివీల్.. రీతువర్మ, నాగశౌర్య లుక్ అదుర్స్..
Follow us on

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‏ను ప్రకటిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో రీతువర్మ, నాగశౌర్య ఎంతో అందగా కనిపించారు. ఆ వీడియోలో విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించగా.. ఎంతో అందంగా చిత్రీకరించారు.

తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రీతువర్మ, నాగశౌర్య సూపర్‏గా కనిపించారు. ప్రస్తుతం హైదరాబాద్‏లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 2021 సమ్మర్లో ఈ మూవీ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, నదియా నటిస్తున్నారు.