వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి మరో ఫొటో లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజీయే వేరు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజీయే వేరు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు. అంతేకాకుండా జనసేన పార్టీ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పవన్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పెద్ద పండగ చేసుకుంటారు. ఇటీవల పవన్ కల్యాణ్ మూడు సినిమాలు ఒప్పుకున్నారు అందులో వకీల్ సాబ్ ఒకటి. హిందీలో విజయవంతమైన పింక్ సినిమాకు తెలుగు రిమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తికావొస్తుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ ఫోటో లీకైనట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసినట్లుంది. అందులో హీరో, హీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. వకీల్ సాబ్‌లో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తోంది. పవన్, శ్రుతి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. వేణు శ్రీరామ్ దర్శకత్వలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని మగుమ.. మగువ అనే పాట పాపులర్ అయిన సంగతి అందరికి తెలిసిందే.