వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. రొమాంటిక్ ప్రేమ కథా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. హీరో, హీరోయిన్, దర్శకుడు.. ఈ ముగ్గురికి ఈ చిత్రం మొదటిదే అయినప్పటికీ.. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించడం.. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించడం.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం. ఇలా పేరు మోసిన వారంతా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఉప్పెనపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల కాకముందే రీమేక్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై ముందు నుంచే మంచి అభిప్రాయం ఉన్న విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ ద్వారా ‘తళపతి’ విజయ్ కుమారుడు జాసోన్ సంజయ్‌ను హీరోగా పరిచయం చేయాలని సేతుపతి అనుకుంటున్నారట. దీనికి సంబంధించి విజయ్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే ‘ఉప్పెన’ రీమేక్ ద్వారా సంజయ్ కోలీవుడ్ ఎంట్రీ జరగనుంది. మరి ఉప్పెన ఎలా ఉండబోతోంది..? సేతుపతి చెప్పినట్లుగానే తన 96 మూవీ కంటే ఉప్పెన బావుండబోతోందా.? అసలు ఉప్పెన ఎప్పుడు విడుదల కాబోతోంది..? ఉప్పెన రీమేక్ వార్తల్లో నిజమెంత..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: నితిన్ ‘రంగ్‌దే’ ఆ హిట్ మూవీ ఫ్రీమేకా..!