Uppena OTT Release Date: త్వరలో డిజిటల్‌లో రానున్న ఉప్పెన మూవీ .. డేట్ ఎప్పుడో తెలుసా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు క్రికెట్ జట్టును తలపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన రోడ్డుపై మెగాఫ్యామిలీ వారసులుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి వరకూ 10 మందికి పైగా హీరోలుగా అడుగు పెట్టారు.. తమదైన స్టైల్ తో తమకంటూ...

Uppena OTT Release Date: త్వరలో డిజిటల్‌లో రానున్న ఉప్పెన మూవీ .. డేట్ ఎప్పుడో తెలుసా..!

Updated on: Feb 14, 2021 | 7:04 PM

Uppena OTT Release Date: టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు క్రికెట్ జట్టును తలపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన రోడ్డుపై మెగాఫ్యామిలీ వారసులుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి వరకూ 10 మందికి పైగా హీరోలుగా అడుగు పెట్టారు.. తమదైన స్టైల్ తో తమకంటూ సొంతం ఫేమ్ ను సంపాదించుకున్నారు. తాజాగా మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అరంగ్రేటం చేశాడు.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు రిలీజై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. బాక్సాపీస్ వద్ద సక్సెస్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఏప్రిల్ 11నుంచి ప్రారంభం కానున్నదని టాక్ వినిపిస్తోంది.

ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఉప్పెన రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే సాంగ్స్ తో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఉప్పెన మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, ఆహా సంస్థలు కూడా పోటీ పడగా.. నెట్ ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిబంధనల ప్రకారం సినిమా రిలీజైన 50 రోజుల అనంతరం డిజిటల్ లో స్ట్రీమింగ్ కు రెడీ కాబోతున్నారని సమాచారం. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదాల పర్వం తరవాత మూడు రోజుల క్రితం రిలీజై సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. వైష్ణవ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం

Also Read:

ప్రేమికుల రోజున తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మేయర్ విజయలక్ష్మి

రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు