Uppena Movie : సముద్రం సాక్షిగా మొదలైన ఓ ప్రేమ కథ.. ఉప్పెన రిలీజ్ డేట్ వచ్చేసింది..

|

Jan 27, 2021 | 7:47 AM

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన

Uppena Movie :  సముద్రం సాక్షిగా మొదలైన ఓ ప్రేమ కథ.. ఉప్పెన రిలీజ్ డేట్ వచ్చేసింది..
Follow us on

Uppena Movie :  మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్‌ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది.

ఇటీవల విదులైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా సుకుమార్ పర్యవేక్షణలో సినిమా తెరకెక్కడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిర్మాతలు మాట్లాడుతూ.. సముద్రం సాక్షిగా మొదలైన ఓ  ప్రేమ కథ ఏ తీరాలకు చేరుకుందనేది ఆసక్తిని పంచుతుందని అన్నారు. ఇక దేవీ శ్రీ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Most Eligible Bachelor : అఖిల్ సినిమాకు కొత్త చిక్కులు.. స్టోరీలో మార్పులు చేయబోతున్న దర్శకుడు.?