YS Sharmila: మెగా హీరో సినిమా పాటను విడుదల చేసిన వైఎస్ షర్మిల.. సాంగ్ బాగుంది అంటూ వ్యాఖ్య..

|

Feb 12, 2021 | 8:44 PM

YS Sharmila Release Mega Hero Movie Song: గతకొన్ని రోజులుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న నేపథ్యంలో వార్తల్లో నిలిచిన వైఎస్ షర్మిల తాజాగా ఓ సినిమా పాటను విడుదల చేశారు. అందులోనూ మెగా కుటుంబానికి చెందిన హీరో.

YS Sharmila: మెగా హీరో సినిమా పాటను విడుదల చేసిన వైఎస్ షర్మిల.. సాంగ్ బాగుంది అంటూ వ్యాఖ్య..
Follow us on

YS Sharmila Release Mega Hero Movie Song: గతకొన్ని రోజులుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న నేపథ్యంలో వార్తల్లో నిలిచిన వైఎస్ షర్మిల తాజాగా ఓ సినిమా పాటను విడుదల చేశారు. అందులోనూ మెగా కుటుంబానికి చెందిన హీరో సినిమాలోని పాటను విడుదల చేయడం విశేషం.

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో మరో మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల ఇండస్ట్రీకి పరిచయవుతోన్న విషయం తెలిసిందే. మేఘన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు అభిరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ‘ఏమిటో.. ఏమిటో’ అని సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను వైఎస్ షర్మిల చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. పాట విడుదల చేసిన తర్వాత షర్మిల చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. పాట చాలా బాగుందని తెలిపిన షర్మిల సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఇక పాటను విడుదల చేసినందుకు నిర్మాత రాజేష్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతం వహిస్తుండగా.. తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మెలోడీ నేపథ్యంలో ఉన్న ఈ లిరికల్ పాటపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Also Read: Chammak Chandra: ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి కోట్లు సంపాదించే స్టేజ్ కు వెళ్లిన జబర్దస్త్ కమెడియన్..