Naga Chaitanya Keerthy Suresh: క్రేజీ కాంబినేషన్.. నాగ చైతన్యతో రొమాన్స్‌కు రెడీ అయిన కీర్తి

మజిలీ, లవ్ స్టోరీ సినిమాల్లో అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం దూత అనే వెబ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ఈ అక్కినేని అందగాడు.

Naga Chaitanya Keerthy Suresh: క్రేజీ కాంబినేషన్.. నాగ చైతన్యతో రొమాన్స్‌కు రెడీ అయిన కీర్తి
Naga Chaitanya,keerthy Sure

Updated on: Jun 24, 2023 | 1:21 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేకపోయారు చై. కెరీర్ బిగినింగ్ కంటే ఇప్పుడు చైతు నటన చాలా మెరుగైంది. మజిలీ, లవ్ స్టోరీ సినిమాల్లో అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం దూత అనే వెబ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ఈ అక్కినేని అందగాడు. ఈసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు చందు. ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో చైతూకి జోడీగా అందాల భామ కీర్తిసురేష్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. నాగ చైతన్య , చెందు మొండేటి కాంబినేషన్లో గాథలో ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం అదిరిపోయే కథను సిద్ధంసి చేశాడట చందు. ఇక కీర్తిసురేష్ అయితే ఈ కథ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఆమెను ఎపిక చేశారట. గతంలో కీర్తిసురేష్ నటించిన మహానటి సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు చైతన్య. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట. కానీ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కీర్తిని ఫైనల్ చేశారట.  అయితే ఈ సినిమా కథ ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది. చందు ఎప్పటిలానే థ్రిల్లర్ కథతో వస్తాడా లేక ఏదైనా లవ్ స్టోరీ తెరకెక్కిస్తాడా అన్నది చూడాలి.