Tees Maar Khan: తీస్‌ మార్ ఖాన్‌గా యంగ్ హీరో ఆది సాయి కుమార్.. ఆసక్తికరంగా టీజర్

|

Jun 18, 2022 | 4:17 PM

యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం వరించలేదు ఈ కుర్ర హీరోకి.

Tees Maar Khan: తీస్‌ మార్ ఖాన్‌గా యంగ్ హీరో ఆది సాయి కుమార్.. ఆసక్తికరంగా టీజర్
Tees Maas Khan
Follow us on

యంగ్ హీరో ఆది సాయి కుమార్(Aadi Saikumar) చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం వరించలేదు ఈ కుర్ర హీరోకి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఆది. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆతర్వాత లవ్లీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం తీస్‌ మార్ ఖాన్, బ్లాక్‌, టాప్ గేర్, క్రేజీ ఫెలో వంటి సినిమాలు చేస్తున్నాడు. వీటిలో తీస్‌ మార్ ఖాన్(Tees Maar Khan) సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆది తీస్‌ మార్‌ ఖాన్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు.

‘రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి’ అంటూ వచ్చే డైలాగ్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, పూర్ణ, కబీర్‌ సింగ్‌ కీలక పాత్రు పోషిస్తున్నారు. ఎస్ 3 ఫెమ్ అనూప్ సింగ్‌ ఠాకూర్‌ విలన్‌గా అలరించనున్నాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కల్యాణ్‌ జి గొగణ దర్శకత్వం వహించారు. మొదటి సారి ఆది ఈ సినిమాతో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ చివరిలో బాగా రాసుకోండి.. బాగా కనపడాలి.. పేరు గుర్తుందిగా తీస్ మార్ ఖాన్ అంటూ ఆది చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో ఆది హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏంజరుగుతుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి