AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే.. 70ఏళ్ల వయసున్న హీరోలు కూడా యంగ్ హీరోయిన్స్ తో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే నాలుగు పదులు దాటిన హీరోయిన్స్ కూడా ఇప్పటికీ యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పిస్తున్నారు .

క్రేజీ కాంబో.. 42 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన 22ఏళ్ల కుర్రభామ..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2026 | 8:33 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది చాలా కామన్ .. హీరోలు, హీరోయిన్స్ సినిమాల విషయంలో ఏజ్ చూడరు. తనకన్నా వయసులో పెద్ద హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే తమకన్నా వయసులో పెద్ద హీరోయిన్స్ తో సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు 42ఏళ్ల ఓ హీరో ఇప్పుడు తన 20ఏళ్ల చిన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.. 42 ఏళ్ల హీరోతో 22ఏళ్ల హీరోయిన్ రొమాన్స్ కు రెడీ అయ్యింది. తనకున్న వయసులో చిన్న హీరోయిన్ తో నటిస్తున్న ఆ హీరో ఎవరో కాదు.. స్టార్ హీరో ధనుష్. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ధనుష్.

వారెవ్వా..! ఏంటి ఈవిడ కమెడియన్ కూతురా.!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్ తో పాటు తెలుగు, హిందీలోనూ సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. హీరోగానే కాదు దర్శకుడిగానూ సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు ధనుష్. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 56వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా

రుక్మిణి వసంత్ ప్లేస్ లోకి లేటెస్ట్ సెన్సేషన్ సారా అర్జున్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవలే ధురంధర్ సినిమాతో సంచలన విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ధనుష్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తుంది. కాగా ధనుష్ కు సారా అర్జున్ కు మధ్య 20ఏళ్ల ఎగ్ గ్యాప్ ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు ధురంధర్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.. రణవీర్ కు ఆమెకు మధ్య 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

వీడెవడండీ బాబు..! అంత అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇలా చేశాడు..!! కృతిశెట్టి షాక్

View this post on Instagram

A post shared by SASHA JAIRAM (@sashajairam)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us