NTR : ఎన్టీఆర్ డ్రాగన్‌లో క్రేజీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వార్ 2 ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

NTR : ఎన్టీఆర్ డ్రాగన్‌లో క్రేజీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
Ntr

Updated on: Jun 03, 2025 | 8:08 PM

మ్యాన్ ఆఫ్ మిసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్ తో బిజీగాఉన్నాడు. ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ , ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు.

ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ కేతిక శర్మ.

అందాల భామ కేతిక శర్మ.. హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సింగిల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత స్పెషల్ సాంగ్ చేసింది. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నదాని పై త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.