మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్. ఇక రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో లెఫ్నెంట్ రామ్ పాత్రలో నటించి మెప్పించాడు దుల్కర్. ఇదిలా ఉంటే ఇప్పుడు మీరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో దుల్కర్ సల్మాన్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడం లేదట. త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ బ్యానర్ లో దుల్కర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు వెంకీ అట్లు దర్శకత్వం వహించనున్నారని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. వెంకీ అట్లూరి ఇప్పటికే ధనుష్ తో సార్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే..