Mahesh Babu and Rajamouli: మహేష్ సినిమా కోసం ఆ బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్న జక్కన్న.?

|

Jun 08, 2022 | 9:53 AM

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాసంచలన విజయం సాధించింది.

Mahesh Babu and Rajamouli: మహేష్ సినిమా కోసం ఆ బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్న జక్కన్న.?
Mahesh Babu Rajamouli
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాసంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ మంచి హిట్ గా నిలిచింది.. అలాగే రికార్డుస్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు(Mahesh Babu) సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవనుంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత పూర్తిగా జక్కన్న సినిమా పై దృష్టి పెట్టనున్నాడు మహేష్. మహేష్ బాబు సినిమా కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఓ కథను అనుకుంటున్నాం అని విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. శ్రద్ధా కపూర్ అయితే ఈ కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన జక్కన్న ఆమెను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. సాహో సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ నటించే పాన్ ఇండియా మూవీ ఇదే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.