Pushpa Movie: అల వైకుంఠపురములో సినిమాలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో ఊరమాస్ లుక్‌లో పుష్పరాజ్ అవతారం ఎత్తారు బన్నీ. కేజీఎఫ్ సినిమా మాస్ హీరోయిజం విషయంలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. కానీ పుష్ప సినిమాలో కేజీఎఫ్‌కు పదింతల హీరోయిజం చూస్తారంటూ ఊరిస్తున్నారు మేకర్స్. మరి హీరోయిజం ఆ రేంజ్‌లో ఎలివేట్ అవ్వాలంటే విలన్‌లు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే పుష్పరాజ్‌కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్ చేశారు సుకుమార్.
కోవిడ్ టైమ్‌లో డిజిటల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన నటుడు ఫాహద్ ఫాజిల్. అప్పటి వరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్.. లాక్ డౌన్ టైమ్‌లో నేషనల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ టాప్ హీరో పుష్ప సినిమా కోసం రూత్‌లెస్ విలన్‌గా మారారు. టీజర్‌లో ఫాహద్ చెప్పి పార్టీ లేదా పుష్ప డైలాగ్‌కే ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది.
అప్పుడెప్పుడే భైరవగీత సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్.. తరువాత సాండల్‌వుడ్‌లో బిజీ అయ్యారు. కన్నడలో హీరోగా చేస్తూనే విలన్ రోల్స్‌లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ వర్సటైల్ స్టార్ కూడా పుష్పరాజ్‌తో వార్‌కు రెడీ అయ్యారు. ఇక టాలీవుడ్ కామెడీ స్టార్ సునీల్ కూడా విలన్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్‌ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నారు సునీల్. వీళ్లతో పాటు యాంకర్ అనసూయ, అజయ్ ఘోష్, శత్రుల లాంటి విలన్లకు లెక్కేలేదు. మరి పుష్పరాజ్ హీరోయిజం నేషనల్ లెవల్‌లో రీసౌండ్ చేయాలంటే.. విలన్లు ఆ రేంజ్‌లోనే ఉండాలి మరి.
( Sathish, ET, TV9 )
మరిన్ని ఇక్కడ చదవండి :