నెపోటిజంపై ఆలియా భట్ తల్లి సంచలన కామెంట్స్..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ సినీ ఇండస్ట్రీలో ప్ర‌క‌పంన‌లు రేపుతొంది. అతని ఆత్మహత్యతో బాలీవ‌డ్ లోని నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నెపోటిజంపై ఆలియా భట్ తల్లి సంచలన కామెంట్స్..

Updated on: Jun 25, 2020 | 9:57 PM

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ సినీ ఇండస్ట్రీలో ప్ర‌క‌పంన‌లు రేపుతొంది. అతని ఆత్మహత్యతో బాలీవ‌డ్ లోని నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వారసత్వంతో ఎదిగిన‌ హీరోలు, హీరోయిన్ల చిత్రాల్ని బాయ్ కాట్ చేయాలంటూ… పలువురు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ కొంద‌రి వ్య‌క్తుల వల‌నే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని కొంద‌రు నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అలియా భట్‌, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్, కరణ్ జోహార్‌లపై విమ‌ర్శ‌ల తాకిడి అధికంగా ఉంది. సోషల్ మీడియాలో వీరికి ఫాలోవర్లు కూడా భారీగా తగ్గారు. ఆలియా భట్‌ను ఏకంగా రెండు లక్షల మంది అన్ ఫాలో చేశారు.

సుశాంత్ బీహర్ రాష్టానికి‌ చెందిన వ్య‌క్తి అవ్వ‌డంతో అక్కడి ప్రజలు బీహార్‌లో సల్మాన్‌ ఖాన్, ఆలియా భట్ సినిమాలను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆలియా భట్ తల్లి సోని రజ్ధాన్ నెపోటిజంపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘ఫలానా వారి బిడ్డ‌లు అంటే ఆడియెన్స్ చాలా అంచ‌నాలు పెట్టుకుంటారు. ఇవాళ‌ బంధుప్రీతి గురించి అతిగా మాట్లాడుతున్న వారు ఏదో ఒక రోజు తమ సొంత పిల్ల‌ల‌ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు పరిశ్ర‌మ‌వైపు ఇంట్ర‌స్ట్ చూపిస్తే.. అప్పుడు ఏం మాట్లాడారు.. వారికి ఏం చెప్పి ఆపుతారు’ అని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. నెపోటిజం అస‌లు మేట‌ర్ కాద‌ని… టాలెంట్ ఉన్న‌వారి అవ‌కాశాలు లాగేసుకుని వారిని తొక్కేయ‌డంపై మాట్లాడాల‌ని ఆమెకు సూచిస్తున్నారు.