
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితులైన తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు.. రష్మిక స్నేహితులైన రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ లాంటి సినీ ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. డ్యాన్సులు, స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ రాత్రి ఒక రేంజ్‌లో గ్రాండ్‌గా, ఎంటర్టైనింగ్‌గా సాగనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిబ్రవరి 26 ఉదయం చాలా సందడిగా ప్రారంభం కానుంది.
ఉదయం సుముహూర్తంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీళ్ళ వివాహం జరగనుంది. ముహూర్తం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఉండటంతో.. తెల్లవారుజాము నుంచే వేద మంత్రాల నడుమ పెళ్లి తంతు మొదలు కానుంది. పట్టు వస్త్రాల్లో విజయ్, రష్మికల జంటను చూడటానికి రెండు కళ్లు చాలవనేలా ఉదయం షెడ్యూల్ మొత్తం అచ్చమైన తెలుగింటి సాంప్రదాయబద్ధంగా ప్లాన్ చేశారు. రెండు విభిన్న సంప్రదాయాల కలయికగా ఈ పెళ్లి జరగడం విశేషం. ఉదయం తెలుగు పద్ధతిలో పెళ్లి పూర్తయ్యాక, సాయంత్రం రష్మిక సొంత సంప్రదాయం అయిన ‘కొడవ’ (కూర్గ్‌లో ఉండే ఆచారం) సంప్రదాయం ప్రకారం వీళ్లు మరోసారి పెళ్లిపీటలు ఎక్కనున్నారు. కూర్గ్ స్టైల్‌లో ప్రత్యేకమైన దుస్తులు, వారి సంప్రదాయ ఆచారాలతో ఈ వేడుకను ఎంతో అందంగా డిజైన్ చేశారు. రెండు కుటుంబాల ఆచారాలకు గౌరవం ఇస్తూ ప్లాన్ చేసిన ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ కొన్ని జంటలు ఇలా రెండుసార్లు పెళ్లి చేసుకున్నాయి.
ఇక సెక్యూరిటీ విషయానికొస్తే.. ఈవెంట్‌కు కేవలం ప్రముఖులు మాత్రమే రానున్నారు. ప్రైవేట్ హెలిప్యాడ్ ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా సెక్యూరిటీని బాగా టైట్ చేశారు. ఫిబ్రవరి 26 ఉదయం 10 గంటలకు తెలుగు సంప్రదాయంలో ఒకసారి.. ఆ తర్వాత సాయంత్రం రష్మిక సొంత సంప్రదాయమైన కొడవ స్టైల్‌లో ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది భోజనమే కదా..! ఈ రాయల్ వెడ్డింగ్‌లో ఫుడ్ మెనూ కూడా అదే రేంజ్‌లో ఉండబోతోంది. అటు పక్కా తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు, ఇటు కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్, కూర్గ్ స్పెషల్ పోర్క్ కర్రీ వంటి నోరూరించే వంటకాలతో అతిథులకు భారీ విందు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రష్మిక ఆచారం ప్రకారం కొడవ సంప్రదాయంలో పోర్క్ కర్రీ (పంది మాంసం)ను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కాంటినెంటల్, లోకల్ వంటకాల కలబోత అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతున్న రిసార్ట్ కూడా ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇదొక లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో, అతిథుల కోసం బుక్ చేసిన రిసార్ట్స్‌లో ఒక్కో గదికి నైట్ రెంట్ ఏకంగా 20 వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఉండబోతుంది. అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలతో టాలీవుడ్ స్టార్లు, బంధువుల కోసం ఈ రిసార్ట్స్‌ను పూర్తిగా బుక్ చేసేశారు. దేశం మొత్తం ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించి మాట్లాడుకుంటుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ విరోష్ వెడ్డింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అదుర్స్ అనిపించాయి. నాప్‌కిన్స్ మీద కూడా ‘VIROSH’ అనే ఎంబ్రాయిడరీ చేయించి.. ప్రతి చిన్న విషయంలోనూ ఈ కపుల్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.