
దర్శకుడు వి.వి. వినాయక్ తన సినీ ప్రస్థానంలో ఎంతో మంది ప్రముఖులతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆది తన మొదటి సినిమా కాబట్టి ప్రాణంగా భావిస్తానని, అయితే స్టైలిష్‌గా తీసిన చెన్నకేశవ రెడ్డి బాలకృష్ణ అభిమానులకు, వారి కుటుంబానికి చాలా ఇష్టమైన సినిమా అని అన్నారు. బాలకృష్ణను అందంగా, స్టైలిష్‌గా చూపించే అవకాశం దక్కడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని, ఈ సినిమా రీ-రిలీజ్‌లో రికార్డులు సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అయితే, కొన్ని ఆర్థిక సమస్యల వల్ల రావాల్సిన రెవెన్యూ ఆగిపోయిందని వినాయక్ తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
తన మొదటి చిత్రమైన ఆదికి ముందు పదేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వినాయక్‌కు చెన్నకేశవ రెడ్డికి రెండు కోట్ల బడ్జెట్ ఒప్పించడం ఒక సవాలుగా మారింది. అయితే, నిర్మాత బెల్లంకొండ సురేష్ అద్భుతమైన వ్యక్తి అని, ఆయన ఒక ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అని అన్నారు. సురేష్‌ను ఉదయాన్నే కలిసి కథ చెప్పగానే, “వినయ్ నువ్వు ఏమనుకున్నావో, నాకేం చెప్పావో అదే తియ్యి, ఎక్కడా రాజీ పడకు” అని చెప్పడం తన జీవితంలో మర్చిపోలేనిదని వినాయక్ పేర్కొన్నారు. కాస్టింగ్ విషయంలో సురేష్‌తో తనకు కొన్ని సార్లు చిన్న విభేదాలు వచ్చాయని, తాను రాజన్ పి. దేవ్ లాంటి వారిని విలన్‌గా అనుకుంటే, సురేష్ ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద నటులను పెట్టాలని కోరారని చెప్పారు. అలాగే, హీరో తండ్రి పాత్రకు కూడా పెద్ద నటులు కావాలని ఆయన పట్టుబట్టేవారని, గ్రాండియర్ కనిపించాలని భావించేవారని వివరించారు. అయితే, తన కన్విక్షన్‌పై నమ్మకముంచి, ఎప్పుడూ తన పనిలో జోక్యం చేసుకోని అద్భుతమైన నిర్మాత బెల్లంకొండ సురేష్ అని వినాయక్ తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
సురేష్ మాత్రమే కాదు, తన కెరీర్‌లో అదుర్స్ నిర్మాతలు నాని, వంశీ, ఆ తర్వాత అల్లు అరవింద్ వంటి వారు కూడా తనను ఎప్పుడూ “నువ్వు ఏం తీస్తున్నావ్?” అని ప్రశ్నించలేదని వినాయక్ సంతోషం వ్యక్తం చేశారు. తన నిర్మాతలు తనపై ఎంతో నమ్మకంతో వ్యవహరించారని, అలాంటి అదృష్టం చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. తనకు బ్యాక్ పెయిన్ ఉండటంతో హాస్పిటల్ నుండి తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొనగా, అల్లు అరవింద్ తన జాగ్రత్త కోసం మనుషులను పెట్టి, ప్లైవుడ్స్ వేయించి మరీ నడిపించారని వివరించారు. తన ఆరోగ్యం పట్ల ప్రొడ్యూసర్లు చూపిన శ్రద్ధ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?