
వేణు స్వామి..! తెలుగు రాష్ట్రాల్లో ఈ జ్యోతిష్యుడి పేరు తెలియని వారు ఉండరు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి రకరకాల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. ముఖ్యంగా సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు, ఎవరికీ ప్రమాదాలు జరుగుతాయి ఇలా రకరకాల విషయాలు చెప్పి నెట్టింట ట్రోల్స్ బారిన పడ్డారు వేణు స్వామి. ట్రోల్స్ ఎక్కువ కావడంతో ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. పలు వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. తాజాగా వేణు స్వామి పై ఓ యాంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఇంతకూ ఆమె ఎవరంటే..
విష్ణుప్రియ.. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణంలో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు.. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయ్యింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియా తన అందాలతో నెటిజన్స్ మతిపోగొడుతోంది. తాజాగా విష్ణు ప్రియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియా మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. తన తల్లికి ఒకానొక సమయంలో ఆరోగ్యం క్షీణించింది. పూర్తిగా ఆరోగ్యం క్షీణించే వరకు మా అమ్మ డాక్టర్ కు చూపించుకోలేదు. చివరకు బలవంతం చేసి నేనే హాస్పటల్ కు చేర్పించా.. డాక్టర్స్ ఆమె మూడు రోజులకు మించి బ్రతకాదు అని చెప్పారు.. కానీ మా అమ్మ ఏడాదికి పైగా బ్రతికారు అని తెలిపింది. అలాగే డాక్టర్స్ చూపించిన సమయంలో నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. హాస్పటల్ బిల్లులకే లక్షలు అయ్యాయి.. దాంతో నేను ఆర్థికంగా కుంగిపోయాను. ఇంకా కట్టడానికి డబ్బులు లేవు. ఆ సమయంలో ఇండస్ట్రీలో దగ్గరైన వేణు స్వామికి ఫోన్ చేసి సాయం అడిగాను. ఆయన వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు కావలసినంత డబ్బు పంపించి మా అమ్మను కాపాడారు అంటూ ఎమోషనల్ అయ్యింది విష్ణు ప్రియా. అలాగే వేణు స్వామి గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడినా కూడా.. ఆయన ఎంతో మందికి సహాయం చేశారు అని తెలిపారు. ఆయన ఎంత సాయం చేసిన మా అమ్మ ఏడాది కంటే ఎక్కువ రోజులు బ్రతకలేదు.. దేవుడు నన్ను తీసుకెళ్లి మా అమ్మను ఉంచి ఉంటే బాగుండేదని చాలాసార్లు కోరుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది విష్ణు ప్రియా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.