
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే య/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సొంత చేసుకొన్న ఈ చిత్రం..పొంగల్ కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయశాంతి మాట్లాడుతూ మహేశ్ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
1988 సమయంలో మహేశ్ బాబుతో కలిసి యాక్ట్ చేశానని చెప్పిన విజయశాంతి..తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆమెను పరిచయం చేసిందని సూపర్‌స్టార్ కృష్ణ గారే అని తెలిపారు. మళ్లీ.. రీ ఎంట్రీ మహేశ్ అవ్వడం ఆశ్యర్యకరంగా ఉందన్నారు. మహేశ్ బంగారం అని..సూపర్‌స్టార్ టైటిల్ ఆయనకు మాత్రమే యాప్ట్ అని తేల్చిచెప్పారు. మహేశ్ సినిమాలోనే సూపర్ స్టార్..కాదని బయట కూడా సూపర్ స్టారే అంటూ మెచ్చుకున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఆయన భాగమయ్యారని..దాదాపు 1000 మంది ఆడబిడ్డలకు గుండె ఆపరేషన్స్ చేయించడం మాములు విషయం కాదన్నారు. మహేశ్ కుటంబం వందేళ్లు బాగుండాలని..వయసులో పెద్దదానిగా కోరుకుంటున్నానని విజయశాంతి చెప్పారు.