Vijay Devarakonda’s Liger : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ను ఏలడానికి బయలుదేరిన లైగర్..

విజయ్ దేవరకొండ.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.

Vijay Devarakonda's Liger : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ను ఏలడానికి బయలుదేరిన లైగర్..
Vijay Devarakonda
Follow us

|

Updated on: Dec 30, 2021 | 1:09 PM

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా‌’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాలు విజయ్‌కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమాతో విజయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లుక్స్ పరంగానే కాకుండా నటనతోనూ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అలా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్. దాంతో విజయ్‌కు సోలో హీరో ఛాన్స్ లు క్యూ కట్టాయి. ముందుగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా మారాడు. ‘పెళ్లిచూపులు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో..

సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. రీతువర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశాడు విజయ్. ఈ సినిమా ట్రైలర్ నుంచే అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా యువతలో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్లే సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు, అతని యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథ పరంగానూ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఓవర్ నైట్‌లోనే విజయ్ క్రేజీ హీరో ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగింది.

ఇక అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోకి రీమేక్ అయిన విషయం తెలిసిందే. అక్కడ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఏరికోరి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లోను అదే రిజల్ట్.. కబీర్ సింగ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కబీర్ సింగ్ సినిమా తర్వాత హిందీ జనాల నోళ్ళల్లో నానాడు విజయ్. దాంతో ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు యూట్యూబ్‌లో హిందీలోకి డబ్ అయ్యి భారీ వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. దాంతో హిందీ ప్రేక్షకులకు కూడా విజయ్ పరిచయం అయ్యాడు. బాలీవుడ్ మీడియా కూడా విజయ్ పై ఆర్టికల్స్ రాయడం.. ఇంటర్వ్యూలు తీసుకోవడంతో అక్కడ మనోడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాదు విజయ్ యాటిట్యూడ్‌కు.. స్టైల్‌కు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఫిదా అవుతున్నారు. హాట్ బ్యూటీస్ సారా అలీఖాన్, జాన్వీ కపూర్ రౌడీ హీరో పై మనసు పారేసుకున్నారు. విజయ్‌తో సినిమా చేయడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని పలు ఇంటర్వ్యూల్లో చెప్పకనే చెప్పేశారు ఈ ముద్దుగుమ్మలు.

ఇక ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఇప్పుడు విజయ్‌ను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. పూరీ దర్శకత్వంలో విజయ్ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌లో ఉంది. ఈ సినిమా పూరీజగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. దాంతో హిందీలోనూ లైగర్ సినిమాకు కావాల్సినంత మార్కెట్ లభించింది. పైగా లైగర్‌లో విజయ్ కు జోడీగా నటిస్తుంది కూడా బాలీవుడ్ భామ అనన్యా పాండే కావడంతో అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోలు ఎక్కువగా రాణించిన దాఖలాలు లేవు. కొత్త సంవత్సరంలో విజయ్ బాలీవుడ్‌లో తనదైన మార్క్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే విజయ్‌కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ బాలీవుడ్‌లో కూడా రాణిస్తాడు అండంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది. ఇక మాస్ పల్స్ తెలిసిన పూరీ లైగర్‌‌తో విజయ్‌ను బాలీవుడ్‌లోనూ నిలబెట్టడం ఖాయం అంటున్నారు. లైగర్ సినిమాలో చాలా స్పెషల్స్ ప్లాన్ చేశాడు దర్శకుడు పూరీ. లైగర్ సినిమా కోసం ఏకంగా లెజెండరీ బాక్సర్‌ మైక్ టైసన్ ను రంగంలోకి దింపాడు. దాంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని చేరాయి. ఇలా విజయ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ను ఏలడానికి బయలుదేరాడు..

హైద్రాబాద్‏ కుర్రాడిగా తెలంగాణ యాసతో విజయ్ దేవరకొండ తనదైన యాటిడ్యూట్‏తో ఫాలోవర్స్‏ను సొంతం చేసుకున్నాడు. సినిమాలే కాకుండా రౌడీ క్లబ్ అనే పేరుతో క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసిన విజయ్ వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో ముద్రవేసుకున్నాడు. అంతేకాకుండా కరోనా, లాక్డౌన్ సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్నవారికి, తన అభిమానులకు ఆర్థికంగా సాయం చేశారు విజయ్. అలాగే కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‏టైన్మెంట్ అనే పేరుతో ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేసి.. చిన్న దర్శకులకు.. సినీ కార్మికులకు సహాయంగా నిలుస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవలే తన సొంత బ్యానర్‏లో పుష్పక విమానం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూసర్‏గానూ సక్సెస్ అయ్యారు విజయ్ .  దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Manoj : టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..