ఆ సీన్ చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది.. అది సినిమానే అని చెప్పిన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది: విజయ్ దేవరకొండ

రణబాలి సినిమాలో రష్మిక మందన్న నటన, ఎమోషనల్ సీన్‌పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూస్తూ తన తల్లి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని వెల్లడించారు. రణబాలి సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అన్నివర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది.

ఆ సీన్ చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది.. అది సినిమానే అని చెప్పిన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda

Updated on: Oct 17, 2026 | 3:08 PM

టాలీవుడ్‌లో క్రేజీ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తుంది.. చిత్రంలోని ఓ ఎమోషనల్ సీన్ గురించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా రష్మిక నటన చూసి విజయ్ తల్లి మాధవి కన్నీళ్లు పెట్టుకున్నారన్న విషయం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.  సినిమా రిలీజ్ తర్వాత చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. రణబాలి చిత్రంలో రష్మిక మందన్న జయమ్మ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ముఖ్యంగా రష్మిక పెళ్లి చీరలో కనిపించిన సందర్భం తనకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని విజయ్ తెలిపారు. అప్పటికి నిజ జీవితంలో తమ వివాహం జరగకపోయినా, ఆమెను ఆ రూపంలో చూడటం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు విజయ్.  జయమ్మ పాత్రపై తనకు ఎంతో ప్రేమ ఉందని, ఆ పాత్ర ప్రేక్షకులకు కూడా బలంగా కనెక్ట్ అవుతుందని విజయ్ అన్నారు

సినిమా సెకండ్ ఆఫ్ లో రణబాలి, జయమ్మ పాత్రల మధ్య వచ్చే కీలకమైన ఎమోషనల్ సన్నివేశం గురించి విజయ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో తాను శారీరకంగా కూడా నొప్పిని అనుభవించినట్లు అనిపించిందని, అందులోని ఎమోషన్స్ తనపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. ఆ సన్నివేశంలో కనిపించే బాధ, భయం ప్రేక్షకులను కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తాయని విజయ్ పేర్కొన్నారు. కథలోని తీవ్రతను, పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో ఈ సన్నివేశం కీలకంగా ఉంటుందని విజయ్ తెలిపారు.

రణబాలి సినిమాను తాను ఇప్పటికే పలుమార్లు చూశానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఎడిటింగ్ సమయంలో రెండుసార్లు సినిమా చూసిన ఆయన, ఫైనల్ కట్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం యాడ్ చేసిన తర్వాత మరోసారి చూసినట్టు తెలిపారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో తన వెనుక కూర్చున్న తల్లి మాధవి ఓ ఎమోషనల్ సన్నివేశాన్ని చూసి బోరున ఏడ్చేశారని విజయ్ గుర్తుచేసుకున్నారు. అది కేవలం సినిమా మాత్రమేనని తాను పదేపదే చెప్పినా ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారని విజయ్ వెల్లడించారు. దీంతో రష్మికను తల్లి పక్కన కూర్చొని ఆమెను ఓదార్చమని చెప్పాల్సి వచ్చిందని విజయ్ అన్నారు. ఈ సంఘటన తనకు ఎంతో గుర్తుండిపోయిందని విజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన చిన్ననాటి స్నేహితుడు కూడా ఆ సన్నివేశాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us