Vijay-Rashmika: ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్ సాంగ్‌కు విజయ్, రష్మికల డ్యాన్స్.. ముగ్గురూ అదరగొట్టేశారు.. వీడియో

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి జరిగి సుమారు రెండు వారాలవుతోంది. అయినా ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించిన వార్త లు కానీ, ఫొటోలు, వీడియోలు కానీ ఇప్పటికీ నెట్టింట వైరలవుతూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్-రష్మికలకు సంబంధించి మరో వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Vijay-Rashmika: ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్ సాంగ్‌కు విజయ్, రష్మికల డ్యాన్స్.. ముగ్గురూ అదరగొట్టేశారు.. వీడియో
Vijay And Rashmika

Updated on: Mar 12, 2026 | 9:55 AM

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న ఇటీవలే పెళ్లిపీటలెక్కారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత విజయ్ సొంతూరులో సత్యనారాయణ వ్రతం, అభిమానులకు భోజనాలు, సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్.. ఇలా మొన్నటివరకు పెళ్లి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు విజయ్, రష్మిక. పెళ్లి తర్వాత జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త దంపతులు రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సోదరుడు, ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ గా మరో ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నతో కలిసి ఆనంద్ దేవరకొండ డాన్స్ చేస్తూ కనిపించారు. ఇప్పుడీ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇటీవలే సంచారమే అనే ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్నరాసిన ఈ పాటను హేశం అబ్దుల్ వహాబ్ అద్బుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సంచారమే సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు సంబంధించిన రీల్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు ఆనంద్ దేవరకొండ.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో,,

ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపగా ఉండాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us