AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Star Trailer: ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్..

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇదివరకు రిలీజ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేశాయి. ఇక తాజాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మధ్య తరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్ ను.. బాధ్యతలను.. ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తాడు.. తన కెరీర్ లో ఎలా ముందుకు వెళ్తున్నాడు

Family Star Trailer: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్..
Family Star
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2024 | 1:52 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. గీతా గోవిందం సూపర్ హిట్ తర్వాత విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇదివరకు రిలీజ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేశాయి. ఇక తాజాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మధ్య తరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్ ను.. బాధ్యతలను.. ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తాడు.. తన కెరీర్ లో ఎలా ముందుకు వెళ్తున్నాడు అనే అంశాలను ఈ మూవీలో చూపించనున్నారని తెలుస్తోంది.

అయితే గీతాగోవిందం సినిమా కంటే.. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మృణాల్ కాకుండా ఈ సినిమాలో అమెరికన్ నటి మరిస్సా రోజ్ గార్డన్, మజిలీ మూవీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రష్మిక మందన్నా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. లైగర్ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ జోడిగా సమంత నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రబృందం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాఠశాల రోజుల్లో సైకిల్ కావాలని నాన్నను అడిగితే బర్త్ డేకు కొంటానని.. సెలవుల్లో కొంటానని చెప్పేవారని.. కానీ ఎప్పటికో ఆ కోరిక నెరవేర్చారని అన్నారు. సైకిలే కాకుండా టీవీ, వీడియో గేమ్,.. కంప్యూటర్.. ఇలా చిన్నతనంలో అందరికీ వాటిపై ఆసక్తి ఉంటుందని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సర్దుకుపోవాల్సి వస్తుందని.. అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఓ పాఠం అని అన్నారు. ఇప్పటికీ తాను ఏదోక విషయంలో సర్దుకుపోతుంటా అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..