Kushi Trailer: ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ఖుషి’ ట్రైలర్.. విజయ్, సమంతా కెమిస్ట్రీ అదుర్స్.!

Kushi Movie Trailer Talk: కాశ్మీర్‌లో తనకు పరిచయమైన బేగం(సమంతా)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు విప్లవ్(విజయ్ దేవరకొండ). ఆమె ముస్లిం అని అనుకుని.. నిండా ప్రేమలో మునిగిపోతాడు. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలుస్తుంది. ఆమె బేగం కాదు.. బ్రాహ్మణ్ అని తెలుసుకుంటాడు విప్లవ్. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆరాధ్య, వేరే మతానికి చెందిన విప్లవ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దీంతో అసలు సమస్య తలెత్తుతుంది.

Kushi Trailer: ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఖుషి ట్రైలర్.. విజయ్, సమంతా కెమిస్ట్రీ అదుర్స్.!
Kushi Trailer 1

Updated on: Aug 09, 2023 | 7:27 PM

విజయ్ దేవరకొండ, సమంతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్.. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. యూట్యూబ్‌లోనూ మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించాయి. దీంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కాశ్మీర్‌లో తనకు పరిచయమైన బేగం(సమంతా)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు విప్లవ్(విజయ్ దేవరకొండ). ఆమె ముస్లిం అని అనుకుని.. నిండా ప్రేమలో మునిగిపోతాడు. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలుస్తుంది. ఆమె బేగం కాదు.. బ్రాహ్మణ్ అని తెలుసుకుంటాడు విప్లవ్. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆరాధ్య, వేరే మతానికి చెందిన విప్లవ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దీంతో అసలు సమస్య తలెత్తుతుంది. వీరి పెళ్లికి.. వారి కుటుంబాలు పెద్దలు ఒప్పుకోరు. అంతే! విప్లవ్, ఆరాధ్య వారి ఇళ్లు వదిలేసి.. బయటకి వచ్చేస్తారు. ఇద్దరూ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే అనూహ్యంగా వీరి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు వస్తాయి. వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు.? ఆరాధ్య నుంచి బేగంగా మారడానికి కారణం ఏంటి.? అనే విషయాలను సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

లీడ్ పెయిర్ విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ బాగుంది. పెద్దలను వదిలేసి.. వేరుగా ఉంటున్న పెళ్లి చేసుకున్నవారి మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న అంశాన్ని శివ నిర్వాణ అద్భుతంగా చూపించినట్టు తెలుస్తోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. కాగా, ఈ సినిమాలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడాకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం…