Venkaiah Naidu: సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సినిమాలో డబుల్ మీనింగ్ కంటే అసలు మీనింగ్ ఏంటో చెప్పాలన్నారు. సినిమాలు తీసే వాళ్లు ముందుగా వాళ్ల కుటుంబ సభ్యులతో చూసి వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇటీవల కొన్ని సినిమాలు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. మాయాబజార్ లాంటి సినిమాలు 100 రోజులు ఆడాయని గుర్తుచేశారు. ఇప్పుడు సినిమాలు ఫస్ట్ షో ఉంటుందా లేదో కూడా తెలియదన్నారు. వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు సినిమాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని సూచించారు.
శిల్పకళా వేదికలో సిరివెన్నెల జయంతి వేడుకలకు హాజరయ్యారు వెంకయ్య నాయుడు. తానా ప్రపంచ వేదిక, సిరివెన్నెల కుటుంబం ఆధ్వర్యంలో సిరివెన్నెల జయంతి వేడుకలు నిర్వహించారు. సిరివెన్నెల నిశ్శబ్ద పాటల విప్లవమన్నారు వెంకయ్య నాయుడు. తాను తెల్లవారుజామున లేచి అన్నమాచార్య కీర్తనలు, సిరివెన్నెల పాటలు వింటానని చెప్పారు.