Daggubati: దగ్గుబాటి రామమోహనరావుకు వెంకటేష్, నాగ చైతన్య నివాళి

ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎంపి దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కారంచేడులోని స్వగృహంలో ఉంటున్నారు.

Daggubati: దగ్గుబాటి రామమోహనరావుకు వెంకటేష్, నాగ చైతన్య నివాళి
Venkatesh

Updated on: Apr 05, 2023 | 3:19 PM

కారంచేడుకు చెందిన 73 ఏళ్ళ సినీ నిర్మాత దగ్గుబాటి రామమోహనరావు అలియాస్‌ మోహన్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎంపి దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కారంచేడులోని స్వగృహంలో ఉంటున్నారు. నిన్న(మార్చి 4న) మోహన్‌రావు మృతి చెందడంతో దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులు మోహన్‌రావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ అంత్యక్రియలకు ఇప్పటికే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, సినీ నటుడు అశోక్‌బాబు హాజరయ్యారు. సినీ నటుడు కొల్లా అశోక్ బాబు సోదరి శారదను రామమోహనరావు వివాహం చేసుకున్నారు . వీరికి ఇద్దరు కుమార్తెలు . చిన్న వయస్సులోనే రామమోహనరావు సినీ రంగ ప్రవేశం చేశారు . ఆయన నిర్మాతగా 1979లో “ఒక చల్లని రాత్రి” సినిమా తీశారు . అనంతరం మరి కొందురు బాగస్వామ్యంతో మరికొన్ని చిత్రాలు తీశారు . సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడు చేరుకొని బాబాయి మృతదేహానికి నివాళులర్పించారు.

రామానాయుడు సతీమణి రాజేశ్వరి, కుమార్తె లక్ష్మి, సినీ నటులు వెంకటేష్ఆయన సతీమణి నీరజ, తదితరులు మోహనబాబు మృతదేహాన్ని సందర్శిం నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సాయంత్రం జరిగే అంత్యక్రియలకు సినీ నటులు వెంకటేష్‌, దగ్గుబాటి రానా, అక్కినేని నాగచైతన్య హాజరుకానున్నారు.