Varun Tej : సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో.. ఆ దర్శకుడితో వరుణ్‌‌‌తేజ్ సినిమా.?

|

Mar 08, 2021 | 11:01 PM

మెగా ఫ్యామిలీ  నుంచి వచ్చిన హీరోల్లో అందరు తమకు తాముగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. వీరిలో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఈ టాల్ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టుకుంటున్నాడు.

Varun Tej : సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో.. ఆ దర్శకుడితో వరుణ్‌‌‌తేజ్ సినిమా.?
Follow us on

Varun Tej Upcoming Movie : మెగా ఫ్యామిలీ  నుంచి వచ్చిన హీరోల్లో అందరు తమకు తాముగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. వీరిలో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఈ టాల్ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టుకుంటున్నాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ గా ఉన్న ఈ కుర్రహీరో ప్రస్తుతం గని అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎఫ్ 2 సినిమా 2019లో సంక్రాంతికానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ను అనీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు వరుణ్. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. గత ఏడాది నితిన్ కు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో  సినిమా చేయబోతున్నడట ఈ మెగా ప్రిన్స్ . ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. వెంకీ కుడుముల త్వరలోనే వరుణ్ తేజ్ తో సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఛలో మరియు భీష్మ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు వెంకీకుడుముల. మరి వెంకీ -వరుణ్ కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 4: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. బిగ్‌బాస్ సీజన్4 ఫేం అలేఖ్య హారికను వరించిన బంపర్ ఆఫర్..

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి.. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..