Aadikeshava movie Twitter Review: మెగా మేనల్లుడి ఊరమాస్ యాక్షన్.. ‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..

ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో సినిమాస్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను నవంబర్ 24న అంటే ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసింది చిత్రయూనిట్.

Aadikeshava movie Twitter Review: మెగా మేనల్లుడి ఊరమాస్ యాక్షన్.. ఆదికేశవ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..
Aadikeshava movie twitter review

Updated on: Nov 24, 2023 | 7:53 AM

ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ ఈ మూవీ తర్వాత ఆ రేంజ్‏లో మరో హిట్ పడలేదు. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలన్ని ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో సినిమాస్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను నవంబర్ 24న అంటే ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసింది చిత్రయూనిట్. మరీ తొలిసారి మాస్ యాక్షన్ సినిమా చేసిన వైష్ణవ్ తేజ్.. ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా ? లేదా అనేది ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్స్.

ఈ సినిమాకు ప్రస్తుతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ హాస్ సరదాగా.. కామెడీతో అలరిస్తుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ యాక్షన్ తో వైష్ణవ్ అదరగొట్టేశారని అంటున్నారు. ఇక శ్రీలీల డాన్స్ ఎనర్జీ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ అల వైకుంటపురంలో సినిమాలోని హిట్ పాటలకు శ్రీలీల డాన్స్ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.